ప్రకృతి ప్రకోపం.. ఓ వైపు లాక్‌డౌన్‌.. మరోవైపు భూకంపం..!

Spread the love

ప్రకృతి ప్రకోపిస్తే తట్టుకోవడం మనిషితో సాధ్యమయ్యేది కాదు. ఒక్కసారి ప్రకృతి తిరగబడితే.. ఎంతటి వారైనా సరే.. ఏ దేశమైనా సరే.. తలగ్గొల్సిందే. ప్రస్త్తుతం కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు పన్నెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు మరో మూడు లక్షల మంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో క్రోయేషియా రాజధానిలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. ప్రకృతి మరోతీరుగా పగబట్టింది. ఆదివారం ఇక్కడ భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత.. 5.3గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకున్నా.. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలయని అధికారులు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి  తరలించారు.


Spread the love
error: Content is protected !!