క్రాకర్స్‌ బ్యాన్‌ తీర్పును వ్యతిరేకిస్తూ సంచలన విషయాలు వెల్లడించిన న్యాయవాది కరుణాసాగర్

Spread the love

తెలంగాణ ప్రభుత్వం క్రాకర్స్‌ కాల్చడంపై నిషేధం విధించిన తీర్పుపై ప్రముఖ న్యాయవాది కరుణాసాగర్‌ సంచలన విషయాలను వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నానంటూ.. పలు అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలను కోర్టు కూడా గమనించాలని విన్నవించుకున్నారు.

కాలుష్యం అనేది కేవలం క్రాకర్స్ కాల్చడం ద్వారానే రాదని.. ఇతరముల ద్వారా క్రాకర్స్ కంటే ఎక్కువగా వస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. అందులో ముఖ్యంగా ఫుడ్‌ ఇండస్ట్రీ నుంచి.. 26 శాతం గ్రీన్‌ హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నాయన్నారు. ఇక మాంసం పరిశ్రమ ద్వారా.. పెద్ద ఎత్తున కాలుష్య వెలువడుతోందని గుర్తు చేశారు. ఒక కిలో మాంసం ఉత్పత్తికి.. దాదాపు 5 నుంచి 20 వేల లీటర్ల నీరు పాడవుతోందన్నారు. ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని.. 2050 నాటికి సముద్రంలో
పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉండబోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. జలచరాల కంటే కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ప్రస్తుతం 3జీ,4జీ,5జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా పక్షులు అంతరించిపోతున్నాయన్నారు. ఇప్పటికే పలు పక్షి జాతులు అంతరించిపోయాని ఆరోపించారు. కాలుష్యం పేరుతో హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తే సహించేది లేదని పునరుద్ఘటించారు. ఇవన్నీ అంశాలను అటుంచితే.. ప్రస్తుతం దీపావళి పండుగకు రెండు మూడు రోజుల సమయం కూడా లేదని.. ఇప్పటికే చిరు వ్యాపారులు హోల్ సేల్ షాప్స్ నుంచి అమ్మకాలు జరిపి.. రిటైల్ వ్యాపారానికి అనుమతులకు కూడా దరఖాస్తు చేశారని.. అమ్మకాలకు పూర్తి ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారని న్యాయవాది కరుణాసాగర్ అన్నారు. ఈ సమయంలో కోర్టు తీర్పు చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

ALSO READ

క్రాకర్స్‌ నిషేధం తీర్పుపై కేసీఆర్‌ సర్కార్‌ వైఖరి ఏంటి..?పండుగలు జరుపుకుంటే కేసులు నమోదు చేస్తారా..?
తెలంగాణలో బాణాసంచా అమ్మకాలపై హైకోర్ట్‌ కీలక ఆదేశాలు.. మండిపడుతున్న హిందూ సంఘాలు


Spread the love
error: Content is protected !!