బాబ్రీ కూల్చివేత కేసులో లక్నో స్పెషల్ సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువడించింది. బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేతలో ఎలాంటి కుట్రలేదని.. కూల్చేవేతకు సరైన సాక్ష్యాధారాలు కూడా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నిర్ధోషులుగా తేలారు.
ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ, సతీష్ ప్రధాన్, మహంత్ నృత్య గోపాల్ దాస్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకు సంబంధించి హాజరవ్వగా.. సాక్షి మహరాజ్, వినయ్ కటియార్, సాధ్వి రితంబరా,ధరమ్ దాస్, చంపత్‌రాయ్‌లతో పాటు మరికొంత మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.28 సంవత్సరాల తర్వాత.. తుది తీర్పు బుధవారం నాడు వెలువడింది.