సీఎం జగన్‌ ఇంటిని ముట్టడించిన భజరంగ్‌ దళ్..నానిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్

Spread the love

తిరుమల ఆలయ ప్రవేశానికి సంబంధించిన డిక్లరేషన్ అంశంకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కోడాలి నానిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కోడాలి నాని.. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై మాట్లాడిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటుగా.. బీజేపీ, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కోడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన తెల్పుతూ తెలంగాణకు చెందిన భజరంగ్‌ దళ్.. హైదరాబాద్‌లోని సీఎం జగన్ నివాసం లోటస్‌ పాండ్‌ను ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. మంత్రి కోడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలని.. నాని వ్యాఖ్యలపై సీఎం జగన్‌ స్పందించాలని తెలంగాణ భజరంగ్‌ దళ్ సంయోజక్ సుభాష్‌ చందర్ డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన భజరంగ్‌ దళ్ కార్యకర్తలందర్నీ గోషా మహాల్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read

జగన్‌ చుట్టు కుట్ర జరుగుతుందేమో..! దేవాలయాలపై జరుగుతున్న వరుస ఘటనలపై స్పందించిన స్వామి పరిపూర్ణానంద


Spread the love
error: Content is protected !!