లిక్కర్‌ వద్దు.. ఉద్యోగాలు ముద్దు.. నగరంలో బీజేవైఎం మెరపు ధర్నా..

Spread the love

BJYM ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి సమస్యలపై ఆబ్కారీ భవన్ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి.. మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. ఊరుకో వైన్స్‌ షాపుకు నోటీఫికేషన్లు జారీచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకూ లాఠీలు విరిగిన.. తూటాలు పేలిన వదిలేది లేదంటూ బీజేవైఎం అధ్యక్షుడు అన్నారు. అయితే ఆబ్కారీ భవన్‌ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కార్యాలయం వైపు దూసుకెళ్తున్న క్రమంలో బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ కార్యదర్శి షెహజాదీతో పాటు.. కార్యవర్గ సభ్యులు సొలంకి శ్రీనివాస్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇక మేడ్చల్‌ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామల పవన్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ గుప్తా, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జోగారావు, శివ, భార్గవి, కల్యాణి, కిరణ్, శరత్ యాదవ్, వేణు, శివ, సందీప్ ముదిరాజ్, జస్వంత్, పవన్, సదాశివ, సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!