బీజేవైఎం జాతీయ కార్యదర్శి షెహజాదీ అరెస్ట్..

Spread the love

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లిక్కర్ మీద ఉన్న సోయి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో లేదంటూ బీజేవైఎం జాతీయ కార్యదర్శి షెహజాది అన్నారు. గురువారం నాడు నగరంలోని ఆబ్కారీ భవన్‌ ఎదుట బీజేవైఎం మెరుపు ధర్నా నిర్వహించింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో బీజేవైఎం రాష్ట్ర నాయకులతో పాటుగా.. జాతీయ కార్యదర్శి షెహజాది కూడా పాల్గొన్నారు. అయితే అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


Spread the love
error: Content is protected !!