ప్రముఖ ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిమానులకోసం ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది.. 1.07 నిమిషాల విడిది ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసారు. తన అభిమానులకు, దేశ ప్రజలందరికి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా దాదాపు ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టొచ్చన్నారు. అంతేకాదు కరోనాను అరికట్టేందుకు సూచనలు చేస్తూ.. చేతులు కడుక్కునే విధానం చూపెట్టారు. సబ్బుతో చేతులు కడుక్కునేప్పుడు కనీసం 20సెకనుల పాటు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అంటూ తెలిపారు. నిత్యం మీ చేతులను శుభ్రంగా కడుక్కొని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఆ వీడియో కింద ఉన్న లింక్ లో చూడండి.
हम सभी कोरोना वायरस (COVID-19) की वजह से चिंतित है।
इस वायरस को फैलने से रोकने के लिए जो एक आसान सी चीज़ हम कर सकते है वो है अपने हाथों को स्वच्छ रखना।
हाथों को 20 सेकंड तक साबुन के साथ धोना अनिवार्य है। हमेशा अपने हाथों को अच्छे से धोएं।#SafeHandsChallenge @UNICEF @WHO pic.twitter.com/63zE8OIvY3
— Sachin Tendulkar (@sachin_rt) March 17, 2020