ఈటల రాజేందర్‌కు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నాడు ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీరందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
కాగా, ఈటల ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. కంగ్రాట్యులేషన్స్ ఈటల రాజేందర్ అన్నా అంటూ ట్వీట్ చేశారు.
Many Congratulations to @Eatala_Rajender anna on being sworn in as MLA of Huzurabad assembly constituency today. My best wishes to him.#HuzurabadWithBJP@blsanthosh pic.twitter.com/14xs9N5jZ3
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 10, 2021