Facebook to shut down face-recognition system.. ఈ ఫీచర్‌ను ఎందుకు ఆపేస్తోంది.. రీజన్‌ ఇదేనా..?

Spread the love

ఫేస్‌బుక్‌.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇంటర్నెట్‌ యూజర్లు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్‌లో ఒకటి. అలాంటి ఈ యాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్‌లో ఉన్న ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను ఆపేస్తున్నట్లు ఆ సంస్థ తన బ్లాగ్‌లో ప్రకటించింది. ఈ విషయాన్ని ఫేస్​బుక్​ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ విభాగ ఉపాధ్యక్షుడు జెరోమ్ పెసెంటి తన ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ఉన్న ఫేస్‌బుక్‌ యూజర్ల ఫేషియల్‌ డేటా మొత్తం డిలీట్‌ కానుంది. ఫేషియల్​ రికగ్నైజైషన్ కోసం ఉపయోగించే.. ఫేస్‌ ప్రింటర్లను కూడా తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

రీజన్‌ ఇదేనా..?

ఫేస్‌బుక్‌ ఉపయోగిస్తున్న యూజర్లలో దాదాపు మూడొంతుల మంది ఈ ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా దీనిపై అభ్యంతరాలు ఎక్కువగా రావడంతో పాటు.. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా సరైన రూల్స్‌ను పెట్టలేకపోతుంది. దీంతో యూజర్‌ వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలిగేలా ఉందంటూ అభ్యంతరాలు వస్తుండటంతో.. ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ తొలగించాలని భావించినట్లు తెలుస్తోంది.


Spread the love
error: Content is protected !!