ఘోర అగ్నిప్రమాదం.. ఆగ్రాను కమ్మేసిన దట్టమైన పొగలు..!

Spread the love

యూపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయి పరుగులు పెట్టారు. సికంద్ర ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటలతో పాటుగా దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జాతీయ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


Spread the love
error: Content is protected !!