లాక్‌డౌన్‌ 2.0.. కేంద్రం జారీచేసిన న్యూ గైడ్‌లైన్స్‌ ఇవే..

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు.. దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, బార్లు కూడా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసివేయనున్నట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా.. కేవలం నిత్యవసరాలకు మాత్రమే అనుమతులనిచ్చింది.

అయితే ఈ మార్గదర్శకాలన్నీ కరోనా హాట్‌స్పాట్‌లలో మాత్రం వర్తించవని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.అయితే హాట్‌స్పాట్‌లను ప్రకటించే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఎటువంటి జనసంచారం ఉండకూడదని స్పష్టం చేసింది. ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వస్తే మాత్రం.. తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీచేసింది.

లాక్‌డౌన్‌ 2.0.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

* పాల పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తుల వ్యాపారలకు అనుమతి
* పౌల్ట్రీ పరిశ్రమల, టీ, కాఫీ, రబ్బరు సాగుకు అనుమతి* నేషనల్‌ హైవేస్‌ పక్కన ఉండే దాబాలకు, వెహికిల్ రిపేరింగ్‌ షాపులకు అనుమతి
* రాష్ట్రాల బార్డర్లు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
* మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు,జిమ్‌,స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంల మూసివేత
* ఎవరైనా వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే పర్మిషన్
* జాతీయ ఉపాధి హామీ పనులకు పర్మిషన్
* బ్యాంక కార్యకలాపాలకు అనుమతించింది.
* ఆక్వా (మత్స్యరంగం) ఉత్పత్తుల కొనగోళ్లు అమ్మాకాలకు అనుమతి
* రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ల ద్వారా నడిచే కార్యకలాపాలకు అనుమతి
* సీడ్స్, పెస్టిసైడ్స్‌, పురుగు మందుల విక్రయాల షాపులకు అనుమతి
* అగ్రికల్చర్‌కు సంబంధించిన యంత్రి పరికరాలు, రెంటల్‌ ఇచ్చే సంస్థలకు అనుమతి
* అనాథాశ్రలు, దివ్యాంగుల ఆశ్రమాలు, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు పర్మిషన్
* భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు
* రాజకీయ మీటింగ్‌లకు, మతపరమైన సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా


Spread the love
error: Content is protected !!