Alert Alert : కరోనా కొసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!

Spread the love

ప్రపంచాన్నిదేశాలని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే దీని బారినపడి ఆరువేల మందికి పైగా ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. మరో లక్షన్నర మందికి పైగా కరోనా సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఇక గత ఫిబ్రవరి నెలలో ఈ వైరస్ మన భరత్ లోకి కూడా అడుగుపెట్టింది. విదేశాలనుండి వచ్చిన వారితోనే ఈ మహమ్మారి మన దగ్గరకు చేరింది. ఈ క్రమంలో కేంద్ర,రాష్ట్ర,ప్రభుత్వాలు.. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో భయాల్ని పోగొట్టేందుకు అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా సహాయక చర్యలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

అయితే గతంలో ఉన్న హెల్ప్ లైన్ నంబర్ల స్థానంలో కొత్త నంబర్లను ప్రకటించింది. ఇక కరోనా వైరస్ గురించి ఎలాంటి వివరాలు కావాలన్నా.. 1075 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. మరో నంబరు 1800-112-545 ద్వారా కూడా కరోనా వైరస్ గురించి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది.
దేశం నుంచి ఈ కరోనా వైరస్ ను నివారించాలని ఇందుకు దేశప్రజలంత కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

కాగా, కేవలం కేంద్ర సూచించే నంబర్లే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి కూడా కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.


Spread the love
error: Content is protected !!