హైదరాబాద్ నగరంతో పాటుగా.. శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇక సికింద్రాబాద్, బేగంపేట్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, చార్మినార్, కోఠి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా భారీగానే కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలువడంతో వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలు చోట్ల ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇక ఈసీఐఎల్, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.