అబ్బాయి కిడ్నాప్‌.. ఆపై గ్యాంగ్‌ రేప్‌.. ఆ తర్వాత మర్డర్‌.. ఇంత దారుణానికి ఒడిగడితే ఎలా..?

Spread the love

పాక్‌లో హిందువుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. వరుస దాడులతో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న అక్కడి హిందువులు భయంతో వణికిపోతున్నారు. ఇన్నాళ్లు సింధ్‌ ప్రావిన్స్‌లో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. దీంతో ఇక్కడి వారు కాస్త సేఫ్‌గా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అక్కడి ముస్లిం మత ఛాందసవాదులు మాత్రం మైనార్టీలైన హిందువులు, క్రైస్తవులను టార్గెట్‌ చేశారు. హిందూ, క్రైస్తవ యువతులను, బాలికలను కిడ్నాప్ చేస్తూ.. ఆపై రేప్‌ చేసి.. బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. పాక్‌లోని ఓ స్వచ్చంద సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం.. ప్రతి ఏటా వెయ్యిమందికి పైగా మైనార్టీలైన హిందూ, క్రైస్తవ బాలికలు, యువతులు, మహిళలు అపహరణకు గురవుతున్నారు. అంతేకాదు.. వారందర్నీ బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని మిర్‌పుర్ఖాస్‌ ప్రాంతంలో జరిగిన సంఘటన కలకలం రేపుతోంది. రాజు కోల్హీ అనే ఓ హిందూ బాలుడిని దుండగులు కిడ్నాప్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఆ బాలుడిని గ్యాంగ్‌ రేప్‌ చేసి హతమార్చారు. దీంతో బాలుడి కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయి.. రోదిస్తున్నారు. ఈ సంఘటనపై పాక్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను “పాకిస్తాన్‌ హిందూ రిఫ్యూజీస్‌” తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. పాక్‌లో జరుగుతున్న దురాగతాలను ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మాత్రమే తెలుస్తోందని.. ఇంకా తెలియని ఘటనలు అనేకం ఉన్నాయని అక్కడి హిందువులు వాపోతున్నారు.

 


Spread the love
error: Content is protected !!