కార్తీక మాసం నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ సారి తొలిరోజే సోమవారం కావడం విశేషంగా మారింది. హిందువులకు పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసంతో పాటు.. ఈ కార్తీక మాసం కూడా ఎంతో విశేషమైంది. ఈ కార్తీక మాసం.. కార్తీకదామోదర మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ సారి ముఖ్యమైన రోజులను గమనిస్తే.. నవంబర్ 16వ తేదీన మొదటి సోమవారం, ఈ రోజే భగినీహస్త భోజనం కూడా చేస్తుంటారు. ఇక నవంబర్ 18వ తేదీన బుధవారం నాడు నాగులచవితి. ఆ తర్వాత నవంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు నుంచి తుంగభద్ర పుష్కరములు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21వ తేదీన శనివారం నాడు శ్రవణా నక్షత్ర కోటి సోమవారం పూజ, నవంబర్ 23వ తేదీన రెండవ సోమవారం, నవంబర్ 25వ తేదీ నాడు బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశిగా ఉంది. ఇక నవంబర్ 26 గురువారం చిల్కు ద్వాదశి, నవంబర్ 28 శనివారం శనిత్రయోదశి, నవంబర్ 29వ తేదీ ఆదివారం కార్తీక పౌర్ణమి/ జ్వాలాతోరణం నవంబర్ 30వ తేదీ మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమిగా ఉంది.
ఇక డిసెంబర్ 4వ తేదీన శుక్రవారం సంకష్టహర చతుర్థి, డిసెంబర్ 07వ తేదీ నాలుగవ సోమవారం, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉపవాస ఏకాదశి, డిసెంబర్ 11 శుక్రవారం గోవత్స ద్వాదశి, డిసెంబర్ 12వ తేదీ శనివారం నాడు శనిత్రయోదశి వస్తోంది. డిసెంబర్ 13వ తేదీన ఆదివారం మాసశివరాత్రి, డిసెంబర్ 14 ఐదవ సోమవారంగా ఉంది. అదే రోజు అమావాస్య సోమవార వ్రతం కూడా ఉంది. డిసెంబర్ 15వ తేదీ పోలిస్వర్గంతో కార్తీక మాసపూజలు ముగియనున్నాయి.