చిలీలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. చిలీలోని వల్లెనర్ ప్రాంతంలో ఉదయం 4.09 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. వల్లెనర్‌ను 23 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపం దాటికి ఎంత నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు తెలిపారు.