బ్రేకింగ్‌.. యోగీ ఇలాకాలో మరో ఎన్‌కౌంటర్‌.. షూటర్‌ హతం

Spread the love

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ ఇలాకాలో మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ సారి పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో షూటర్‌ గిరిధారి హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. లక్నో నగరంలోని విభూటీఖండ్‌ గోమతినగర్‌లో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. షూటర్‌ గిరిధారి పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో షూటర్ గిరిధారి హతమయ్యాడు. జనవరి 6వ తేదీన గ్యాంగ్‌స్టర్‌, నేరగాడు అయిన అజిత్‌సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా షూటర్‌ గిరిధారి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే హత్య జరిగిన స్థలానికి షూటర్‌ను తీసుకెళ్లి.. వెపన్స్‌ కోసం వెతుకుతుండగా.. షూటర్‌ గిరిధారి ఎస్సైను తోసి రివాల్వర్ లాక్కుని పారిపోబోయాడని.. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ.. పోలీసులపైకి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గిరిధారి హతమయ్యాడని వెల్లడించారు.


Spread the love
error: Content is protected !!