రెండు నిమిషాల్లో మాస్క్ రెడీ.. కేంద్రమంత్రి చేశారు చూడండి..! వీడియో 

Spread the love

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోగా. మరో పద్దెనిమిది లక్షలమంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో మనదేశంలో ఈ వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు వస్తున్న ప్రజలకు మాస్కులు తప్పని సరిచేస్తూ ఆదేశాలు జారీచేశాయి. దీంతో దేశంలో మాస్కుల కొరత ఏర్పడే అవకాశం ఉందని.. పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మాస్కులు ఇంట్లోనే రెడీ చేసుకున్నవి కూడా పెట్టుకోవచ్చని.. ఇటీవల సీఎంలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ పరోక్షంగా సూచించిన విషయం తెలిసిందే. అయితే  ఈ మాస్కులు ఇంట్లో కేవలం రెండు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ వీడియో పోస్ట్ చేశారు.తన అధికారిక ట్విట్టర్ లో మాస్క్ రెడీ చేసే వీడియోను పోస్ట్ చేశారు. మీరు ఓ లుక్ వేయండి.

 

 


Spread the love
error: Content is protected !!