జనతా కర్ఫ్యూ సక్సెస్‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని చూపిస్తూ.. కరోనా వైరస్‌కు చెక్ పెట్టేంత వరకు పోరాడాలన్నారు.
అలాగే “వైద్యో నారాయణో హరి:” అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ.. కరోనా వ్యాధి బాధితులకు స్ఫూర్తిదాయక వైద్యసేవలు అందిస్తోన్న మన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సేవలను ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులతో జేజేలు పలికిన అశేష ప్రజానీకానికి కూడా అభినందనలు తెలిపారు.
కరోనా ప్రబలకుండా ఈ వీడియోలో చెప్పిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోండంటూ పలు సూచనలు చేశారు. ప్రతి కుటుంబంలో ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలని.. క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా బారిన పడకుండా.. ప్రజారోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీగారి పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని చూపి కరోనాపై పోరాటాన్ని విజయవంతం చేద్దాం. (1/3) pic.twitter.com/Wv9sKfDXVw
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2020
అలాగే “వైద్యో నారాయణో హరి:” అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ… కరోనా వ్యాధి బాధితులకు స్ఫూర్తిదాయక వైద్యసేవలు అందిస్తోన్న మన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు. వారి సేవలను ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులతో జేజేలు పలికిన అశేష ప్రజానీకానికి అభినందనలు. (2/3)
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2020
కరోనా ప్రబలకుండా ఈ వీడియోలో చెప్పిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి కుటుంబంలో ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలి, క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రజారోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. కరోనా బారినుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. (3/3)
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2020