బ్రేకింగ్‌.. నెల గడవకముందే.. లెబనాన్‌లో మరో భారీ ప్రమాదం..!

Spread the love

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మరో భారీ ప్రమాదం సంభవించింది. గత నెలలో రాజధాని బీరుట్‌ పోర్ట్ ఏరియాలో నిల్వా ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ పేలుళ్లతో బీరుట్ పరిసర ప్రాంతాలన్నీ వణికిపోయాయి. ఈ విషాద ఘటన మరిచిపోకముందే.. ఇదే ప్రాంతంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. వాహనాల టైర్లు, ఇంజిన్ ఆయిల్‌ నిల్వా ఉంచిన ఓ గోడౌన్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని లెబనాన్‌ సైన్యం ఓ ప్రకటనలో తెల్పింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎంత నష్టం వాటిల్లింది..? ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా..?అన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగలు, ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు.

కాగా, గత నెల ఆగస్టు 4వ తేదీన బీరుట్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 190 మంది వరకు మృతిచెందగా.. మరో 6000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన జరిగిన నెల రోజుల వ్యవధిలోనే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం.. అది కూడా పోర్ట్ ఏరియాలోనే చోటుచేసుకోవడంతో అంతా వణికిపోతున్నారు.


Spread the love
error: Content is protected !!