పాక్‌లో గత కొద్ది రోజులుగా యుద్ధ విమానాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా పాక్ వైమానిక దళానికి చెందిన ఓ ఫైటర్ జెట్.. మంగళవారం నాడు అటాక్ ప్రాంతంలోని పిండిగెట్ సమీపంలో కుప్పకూలింది. రెగ్యులర్ ట్రైనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. అంతేకాదు.. ఈ ప్రమాదంలో ఎలాంటి ఇతర నష్టాలు కూడా సంభవించలేదని “ది డాన్” కథనంలో తెలిపింది. ఈ ఘటనపై ప్రత్యేక బోర్డు ద్వారా దర్యాప్తు చేపడుతున్నట్లు పాక్ ఏయిర్ ఫోర్స్ తెలిపింది.
కాగా, డాన్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇలా ఐదు యుద్ధ విమానాలు కుప్పకూలయాని తెలపింది. ఈ ఏడాది మార్చిలో రిహార్సల్స్ నిర్వహిస్తున్న సమయంలో మార్చి 23వ తేదీన పాక్ ఫైటర్ జెట్ ఎఫ్-16 కుప్పకూలింది. ఈ ఘటన ఇస్లామాబాద్ సమీపంలోనే చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇక ఫిబ్రవరిలో ఖైబర్ ప్రాంతంలో ట్రైనింగ్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఇక ఇదే నెలలో మిరాజ్ యుద్ధ విమానం కూడా కుప్పకూలింది. ఈ ఘటన లాహోర్-ముల్తాన్ సమీపంలో చోటుచేసుకుంది. అయితే ఈ రెండు సంఘటనల్లో పైలట్లు సేఫ్‌గా బయటపడ్డారు. ఇక ఏడాది ప్రారంభం జనవరి మాసంలో మియాన్వలీ సమీపంలో ట్రైనింగ్ ఫైటర్ జెట్ ఎఫ్‌టీ-7 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.