ఇంత దారుణమా.. పాక్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవును క్రేన్‌తో పైకి ఎత్తి..!!

Spread the love

పాకిస్థాన్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవులను యథేచ్చగా వధిస్తుంటారు. అది కూడా సాధారణంగా కాదు.. వాటిని రెండంతస్థుల ఇళ్లల నుంచి క్రేన్‌ల ద్వారా కిందకు దింపి.. ఆ తర్వాత నడిరోడ్డుపై వాటిని వధిస్తుంటారు. అయితే ఈ ఏడాది జరిగిన బక్రీద్‌ వేడుకల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఖంగుతినాల్సిందే.

“పాక్ హిందూ”( @PakHindus) అనే ఓ ట్విట్టర్‌ అకౌంట్‌లో కరాచీలో జరిగిన ఆవు వధకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ” ఈ వీడియో చూసి నాకు ఏడుపు ఆగడం లేదు. ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా..?” “(My heart is crying after watching this video.)” అంటూ పోస్ట్ చేశారు.

Disclaimer: Disturbing visual. Viewer discretion advised.

బక్రీద్‌ సందర్భంగా ఓ ఆవును రెండంతస్థుల ఇంటి నుంచి క్రేన్‌కు కట్టి కిందకు దించుతున్నారు. అయితే అదే సమయంలో దాని కంట్రోల్ తప్పి అంత ఎత్తు నుంచి కిందపడి చనిపోయింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున జన సమూహం ఉంది. అయితే ఈ వీడియో కరాచీలో జరిగిందనాడనాకి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కానీ గతంలో పాక్‌లో ఇలా క్రేన్‌లతో ఆవులను కిందకు దించే విధానం ఉంది. దీనికి సంబంధించి కొన్ని యూ ట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి. అందులో ఆవులను రెండు మూడు అంతస్థుల నుంచి క్రేన్‌లతో తాళ్లు కట్టి కిందకు దించుతున్న అనేక దృశ్యాలు ఉన్నాయి. అయితే పాక్ హిందూస్ ట్విట్టర్లో పెట్టింది మాత్రం ఎంతో క్రూరంగా ఉంది. అందులో ఆవు అంత పై నుంచి కిందకు పడటం.. ఆ తర్వాత అది చనిపోవడం.. హృదయాలను కలచివేస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని జాతీయ మీడియాకు సంబంధించిన ఓ వెబ్‌సైట్ ప్రచురించింది.


Spread the love
error: Content is protected !!