విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శిగా శ్రీ పండరి నాథ్ గారిని నియమించినట్లు అఖిల భారత మహామంత్రి శ్రీ మిలింద్ పరాండే జీ ప్రకటన చేశారు. తమిళనాడులోని కాంచీపురం లో జూన్ 24 నుంచి 27వ తేదీ వరకు అఖిల భారత సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో సంస్థలో కొన్ని మార్పులు కూర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ప్రాంత కార్యదర్శిగా ఉన్న శ్రీ బండారి రమేష్ గారిని తెలుగు ప్రాంతాల సేవా ప్రముఖ్ గా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంత అధ్యక్షులుగా ఉన్న శ్రీ మూసపేట రామరాజు గారిని తెలంగాణ ప్రాంత సలహా సభ్యులుగా నియమించారు. కార్యద్యక్షులుగా ఉన్న శ్రీ సురేందర్ రెడ్డి గారిని ప్రాంత అధ్యక్షులుగా నియమించారు.
కాగా, పాట్నా క్షేత్ర సంఘటన మంత్రిగా ఉన్న శ్రీ ఆకారపు కేశవరాజు గారిని చెన్నై క్షేత్ర సంఘటన మంత్రిగా నియమించారు. ఇలా దాదాపుగా 34 మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.