పేటీఎంకు గూగుల్ షాకిచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించింది. డిజిటల్ పేమెంట్స్ సంస్థల్లో పేటీఎం ప్రముఖ యాప్స్‌లలో ఒకటి. అయితే పేటీఎంతో పాటుగా.. పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌ను కూడా గూగుల్ తొలగించింది.
అయితే పీటీఎం బిజినెస్, మాల్, పేటీఎం మనీ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లలో అలాగే ఉన్నాయి. గ్యాంబ్లింగ్ రూల్స్ ఉల్లంఘించిందన్న కారణంగా గూగుల్ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటీసులను కూడా గూగుల్ పేటీఎంకు జారీ చేసినట్లు సమాచారం.