పారిస్‌లో బుధవారం నాడు భారీ పేలుడు శబ్ధం కలకలం రేపింది. బుధవారం నాడు మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు శబ్ధం సంభవించడంతో.. స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పేలుడు శబ్ధం పారిస్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల వరకు పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఈ పేలుడు శబ్ధంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ పేలుడు శబ్ధం బాంబు పేలుడు కాదని.. మిలటరీ జెట్ ధ్వని వేగాన్ని విచ్చిన్నం చేయడంతో సోనిక్ బూమ్ కారణంగా శబ్ధం వచ్చిందన్నారు. అయితే ఈ ఘటనతో ఎమర్జెన్సీ కాల్స్ పెరగడంతో.. పేలుడు శబ్ధంకు సంబంధించి పోలీసులు ప్రజలకు క్లారిటీ ఇస్తూ.. కాల్స్ చేయడం ఆపమంటూ కోరారు.
అయితే పేలుడు శబ్ధం వచ్చిన సమయంలో.. స్థానికంగా బ్యాట్మింటన్ ఆడుతున్న ఓ కోర్టులో వీడియో చిత్రీకరిస్తుండగా..అందులో ఈ శబ్ధం రికార్డ్ అయ్యింది.