కేరళలో మరోసారి రాష్ట్టీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలపై దాడులు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం పనిలో భాగంగా భార్యతో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సంజిత్ అనే స్వయం సేవకుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగులు సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPIకి చెందిన వారుగా తెలుస్తోంది. ఈ సంస్థ ప్రముఖ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFI)కి రాజకీయ విభాగంగా పనిచేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతలో పాలక్కడ్ జిల్లాలోని ఎల్లపుల్లికి చెందిన ఏ.సంజిత్.. భార్యతో కలిసి తన బైక్‌పై పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అతడి బైక్‌ను కారులో వచ్చిన ఎస్డీపీఐకి చెందిన గుండాలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. సంజిత్ భార్య చూస్తుండగానే.. అతడిని కత్తులతో దారుణంగా పొడిచి గాయపరిచారు. ఘటన జరిగిన సమయంలో స్థానికంగా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడే ఉన్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంజిత్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు
ఈ ఘటనకు సంబంధించి పాలక్కడ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరిదాస్ మాట్లాడుతూ.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని.. దీని వెనుక సీఎం పినరయ్ విజయన్ హస్తముందని ఆరోపించారు. ఎస్‌డీపీఐకి పినరయ్ విజయన్ ప్రభుత్వం ఎల్‌డీఎఫ్ మద్దతుగా ఉందన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని.. సీఎం పినరయ్ ప్రభుత్వం ఘటనలకు బాధ్యులైన దుండగులను పట్టుకోవడంలో విఫలమైన కారణంగానే నేడు మరో కార్యకర్త ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ మృతదేహాన్ని పాలక్కడ్ జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచి.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Kerala | An RSS worker hacked to death in Palakkad around 9 am today; attacked while traveling with his wife. Details awaited, as per Police
— ANI (@ANI) November 15, 2021
ఫిబ్రవరిలో ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై..
కాగా, ఇదే ఏడాది ఫిబ్రవరి మాసంలో అలప్పుజాలోని వాయలార్ గ్రామ పంచాయితీ పరిధిలో ఇద్దరు స్వయం సేవకులను ఇదే ఎస్‌డీపీఐకి చెందిన గుండాలు దారుణంగా హతమార్చారు. అంతేకాదు.. హిందువులపై 1921లో మలబార్ హిందూ మారణహోమం జరిగి వందేళ్లయిందంటూ శతాబ్ధి ఉత్సవాలంటూ వికృత చేశ్టలతో ఎస్‌డీపీఐ ర్యాలీలు చేపట్టింది.1921లో జరిగిన మలబార్ హిందూ మారణహోమంలో దాదాపు 10 వేల మందికి పైగా హిందువుల చంపబడ్డారు. లక్షల సంఖ్యలో హిందువుల కేరళను విడిచి వెళ్లారు.
Also Read This