కేరళలో మరో దారుణం.. RSS స్వయం సేవక్ దారుణ హత్య

Spread the love

కేరళలో మరో దారుణం.. RSS స్వయం సేవక్ దారుణ హత్య

కన్నూర్ లో RSS స్వయం సేవక్ జింనేష్ ను అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు

గురుదక్షిణ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన ఘటన

ఇతర స్వయం సేవకులపై కూడా దాడికి పాల్పడ్డ గుండాలు

కేరళలో మరో దారుణ సంఘటన చోటచేసుకుంది. కన్నూర్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. సంఘ కార్యక్రమం అయిన గురుపూజ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న జింనేశ్ అనే స్వయం సేవక్ పైన కొందరు దుండగులు అడ్డుకుని దారుణంగా హతమార్చారు. ఈ దారుణ ఘటనకు పాల్పడింది స్థానిక సీపీఎం పార్టీకి చెందిన వారే అని అక్కడి స్వయం సేవకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మరికొందరి స్వయం సేవకులపై కూడా దాడికి పాల్పడ్డారు. అయితే ఇటీవల కేరళలో RSS కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవల RSS కార్యాలయంపై దాడి జరిగిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో కూడా సీపీఎం పార్టీకి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Spread the love
error: Content is protected !!