ప్రముఖ తెలుగు హీరో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ ద్వారా ఆయనకు అభిమానులు, ప్రముఖులు విషెస్ చెప్తూ.. ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ వారి అనుభూతుల్ని షేర్ చేసుకుంటూ.. ప్రిన్స్‌కు విషెస్ చెప్తున్నారు.
ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. అర్ధరాత్రి నుంచి ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సురేష్ ప్రోడక్షన్స్ వెంకటేష్‌తో కలిసి దిగిన ఫోటోను జతచేస్తూ మహేష్ బాబుకు విషెస్ చెప్పారు.