అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

రాఫెల్‌ వస్తుందని తెలిసి కూడా.. కవ్వింపులకు పాల్పడుతున్న పాక్..

పాక్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దువెంట కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం రాత్రి 10.00…

బ్రేకింగ్‌.. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది అధినాయకత్వం. సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.…

రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. ఇక రోజు వారీగా..

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక రోజు వారీగా వార్తలను చదువుతానని తెలిపారు. అదేదో…

“మహా” రాజకీయాల్లో కలకలం.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం..!

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం.…

ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియాకు ట్రాయ్ ఝలక్‌.. ఆ ప్రీమియం ప్లాన్స్‌ రద్దు..!

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ టెల్,ఐడియా, వోడాఫోన్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీలు కస్టమర్లకు అందిస్తున్న…

గ్లెన్‌మార్క్‌ నుంచి మరో గుడ్‌న్యూస్‌.. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ ధర తగ్గింపు..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు.. సరైన మెడిసిన్‌…

బిగ్‌ బ్రేకింగ్‌.. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌లో హతం

మోస్ట్ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబేను యూపీ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నుంచి కాన్పూర్‌ తీసుకెళ్తుండగా..…

7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 20 వేలకు చేరువలో మరణాలు..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో…

పతంజలి కోరోనిల్‌కి భారీ షాకిచ్చిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ..!

పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీ షాక్ ఇచ్చింది. పతంజలి విడుదల చేసిన కరోనా కిట్‌కు బ్రేకులు వేసింది.…

error: Content is protected !!