ప్రయాగ్‌రాజ్‌లో లవ్ జిహాద్: IPL క్రికెట్ ప్లేయర్ మొహ్సిన్ ఖాన్ సోదరుడిపై కేసు నమోదు.. బలవంతంగా ఇస్లాంలోకి మారమంటూ..!!

Spread the love

దేశవ్యాప్తంగా నిత్యం లవ్ జిహాద్ కేసులు ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మరో కేసు బయట పడింది. ఈ కేసులో నిందితుడు ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్ మొహ్సిన్ ఖాన్ సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌.

ప్రయాగ్‌రాజ్‌లోని శివ్‌కుటి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఐపిఎల్ క్రికెట్ ప్లేయర్ మొహ్సిన్ ఖాన్ సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌పై లవ్ జిహాద్ ఆరోపణలు చేసింది. తను మొదటగా బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు నటించి తనను పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళా పోలీసు కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేస్తున్నాడని.. అంతేకాకుండా తన తండ్రి ముల్తాన్ మరియు సోదరుడు మొహ్సిన్ ఖాన్‌తో లైంగిక సంబంధం పెట్టుకోమని ఇమ్రాన్ ఖాన్ బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. కాగా, మొహ్సిన్ ఖాన్ ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఫాస్ట్ బౌలర్ గా ఆడుతున్నాడు.

 

సీఎం యోగీ కి బాధితురాలి వీడియో సందేశంలో…

వారణాసి పట్టణానికి చెందిన సదరు బాధితురాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వీడియో సందేశంతో సహాయం కోసం వేడుకుంది. తన భర్త ఇమ్రాన్ ఖాన్ మరియు అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు తొలుత పోలీసులను ఆశ్రయించినప్పుడు, ఫిర్యాదు నమోదు చేయడంలో పోలీసులు విముఖత చూపారని ఆమె చెప్పుకొచింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 23, 2023న ప్రయాగ్‌రాజ్ పోలీసులు నిందితుడు ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టంకు సంభందించిన సెక్షన్‌లను ప్రయోగించలేదని.. నిందితుడి ఇమ్రాన్ ఖాన్ సోదరుడు ప్రముఖ క్రికెటర్ కాబట్టి, అతని పేరు మరియు అతని తండ్రి పేర్లను ఎఫ్‌ఐఆర్ నుండి తొలగించారని కూడా ఆమె ఆరోపించింది.

2016లో ఇమ్రాన్‌ఖాన్‌ను మొరాదాబాద్‌లో పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు కలిశానని తన బాధను వీడియోలో వివరిస్తోంది. తొలుత తనను పెళ్లి చేసుకునేందుకు బౌద్ధమతాన్ని స్వీకరించాడని తెలిపింది. అనంతరం 2018లో ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్నాడని.. వివాహం తర్వాత, ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం మతంలోకి మారాలని ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడని.. అంతేకాకుండా బలవంతంగా ఆమె పేరును జైరా బానుగా మార్చినట్లు తెలిపింది.

https://www.facebook.com/prayagrajnews1st?ref=embed_video


Spread the love
error: Content is protected !!