యోగాపై బ్యాన్ ఎత్తివేశారు.. కానీ “నమస్తే”కు దూరం ఉండాలట..!

Spread the love

ఎన్నో ఏళ్లనుండి అమెరికాలో యోగాపై ఉన్న నిషేధాన్ని ఎట్టకేలకు ఎత్తివేశారు.1993లో అలబామా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ యోగాపై నిషేధాన్ని విధించింది. అయితే తాజాగా ఈ నిషేధాన్ని అలబామా ప్రతినిధుల సభ తొలగించింది. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు జెరిమీ గ్రే ప్రవేశపెట్టిన యోగా నిషేధ ఎత్తివేత తీర్మానాన్ని.. సభ 84-17 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దీంతో “యోగా” బిల్లును పునరుద్ధరించారు. అయితే యోగా నిషేధాన్ని ఎత్తివేసిన సభ..మరో కిటుకు పెట్టింది. నమస్తేకు మాత్రం దూరంగా ఉండాలంటూ సభ పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కాగా, ఓ వైపు కరోనా బారిన పడకుండా.. సామాన్య ప్రజల నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు నమస్తే పెడుతుంటే.. నమస్తేను సభ నిషేధించడం గమనార్హం.


Spread the love
error: Content is protected !!