కాలు జారి వరదలో కొట్టుకుని పోబోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కాపాడిన సహాయకులు

Spread the love

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక మార్గాలు మూతపడ్డాయి. సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. మళ్లీ ఎక్కడో ఓ చోట కొండ చరియలు విరిగిపడుతుండటం నిత్య కృత్యం అవుతోంది. ఈ క్రమంలో పితోర్‌గర్‌ జిల్లాలో ధర్చులా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ దామీ అక్కడి గ్రామాలను సందర్శిస్తున్నారు. ధర్చులా ప్రాంతంలో పర్యటిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రమాదం సంభవించింది. ఓ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ నది దాటాల్సి వచ్చింది. అయితే అటుగా వెళ్లేప్పుడు వరద ప్రవాహం నార్మల్‌గానే ఉన్నా.. రిటర్న్‌ వచ్చే సమయంలో వరద ఉదృతి పెరిగింది. ఇది చూడకుండా సదరు ఎమ్మెల్యే నది ప్రాంతాన్ని దాటుతుండగా.. కాలు జారిపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న సహాయకులు అలర్ట్‌ అయ్యారు. వరద నీటిలో జారిపడ్డ అతడినిక కాపాడారు. స్వల్ప గాయాలైనట్లు ఎమ్మెల్యే సహాయకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Spread the love
error: Content is protected !!