హంద్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు జవాన్ల వీరమరణం..!

Spread the love

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు.. అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు మన జవాన్లు వారి కుట్రలను భగ్నం చేస్తూ.. పలు సందర్భాల్లో వారి ప్రాణాలు కోల్పోతూ వీరమరణం పొందుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో సీఆర్‌పీఎఫ్‌ పెట్రోలింగ్‌ టీంపై వాగూరా నౌగమ్‌ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా.. మరో ఏడుగురు జవాన్లకు గాయాలైనట్లు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. కాగా అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని క్వజియాబాద్‌ ప్రాంతంలో మట్టుబెట్టినట్లు తెలిపారు.

 


Spread the love
error: Content is protected !!