విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ గురించి తెలిసిందే.. గ్రౌండ్ లో ఉంటే సిక్సర్లు ఎలా బాదుతాడో చెప్పక్కర్లేదు. అయితే బంతుల్ని కొట్టినట్లు.. చాలా ఈజీగా హిందీ మాట్లాడొచ్చు అనుకున్నాడేమో.. ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కలిసి ఓ స్క్రిప్ట్ చదవడానికి ప్రయత్నించి విఫలమైయ్యాడు. అయితే ప్రారంభంలో ఓ రెండు ముక్కలు బాగానే మాట్లాడాడు.”కాన్ఫిడెన్స్ మేరా, కబర్ బనేగి తేరి” అంటూ.. కానీ ఇక ఆ తర్వాత ఏం మాట్లాడాడో అతనికి కూడా తెలుసో తెలియదో. ఇక ఆ 17 సెకన్లలో జరిగిన ఆ సన్నివేశాన్ని యువరాజ్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చుసిన వారంతా సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు గేల్ ఏమన్నాడో ఈ కింద ట్విట్టర్ లింక్ ఓపెన్ చేసి చుడండి.
Confidence meraaaa ! Kabar banegi teri !! Well said kaka 🤣🤣🤣 @henrygayle pic.twitter.com/12ctFAUP9f
— yuvraj singh (@YUVSTRONG12) March 15, 2020