పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నేటికి(మార్చి 14) ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు.. జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే, ఈ సారి సెలెబ్రేషన్స్ కి రాజమహేంద్రవరం వేదిక కానుంది. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.00 గంటలకు ధవళేశ్వరంలోని రామపాదాల రేవులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి నదికి హారతి ఇచ్చి ‘మన నుడి – మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఈ సందర్బంగా జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా.. “మన నుడి-మన నది”కార్యక్రమ విశేషాలు.. ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ” నది మన జీవం , నుడి మన జీవనం. ఇవి పదాలు కాదు, మన జీవిత గమనాన్ని మార్చే రథ చక్రాలు” అంటూ సోషల్ మీడియాలో #ManaNudiManaNadi హ్యాష్ టాగ్ తో పోస్ట్ చేసారు.
మన నుడి – మన నది
నది మన జీవం , నుడి మన జీవనం. ఇవి పదాలు కాదు, మన జీవిత గమనాన్ని మార్చే రథ చక్రాలు.#ManaNudiManaNadi pic.twitter.com/3ePyM1RuHl— JanaSena Party (@JanaSenaParty) March 13, 2020