సిక్కుల్లో ఆందోళన.. భర్త సమక్షంలోనే.. పాక్‌లో ముస్లిం వ్యక్తిని వివాహమాడిన భారత మహిళ.. ఇస్లాంలోకి మతమార్పిడి.. పూర్తి వివరాలు

Spread the love

గురుపూరబ్‌ సందర్భంగా పాక్‌కు వెళ్లిన ఓ సిక్కు వివాహిత ఇస్లాంలోకి మతం మారింది. ఈ ఘటన సిక్కు సమాజంలో కలకలం రేపుతోంది. “జీన్యూస్‌” నివేదికల ప్రకారం వివరాల్లోకి వెళితే.. సిక్కుల పవిత్ర స్థలమైన గురునానక్‌ జన్మస్థలం గురించి తెలిసిందే. అయితే ఈ స్థలం పాక్‌లోని పంజాబ్‌లో ఉంది. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ పవిత్ర స్థలానికి వెళ్లేందుకు పాక్‌ అనుమతి తప్పనిసరి. అయితే ఇలా కొందరు సిక్కులు పాక్‌లో ఉన్న గురుద్వారాలను సందర్శించేందుకు పాక్‌ టూరిస్ట్‌ వీసా కూడా పొందుతుంటారు. అలా కోల్‌కతాకు చెందిన ఓ సిక్కు మహిళ భర్తతో కలిసి పాక్‌లోని గురుపూరబ్‌ను దర్శించుకునేందకు వెళ్లింది. వారిద్దరు మూగ, చెవిటివారని తెలుస్తోంది. సదరు ముస్లిం వ్యక్తి కూడా మూగవాడేనని నివేదికలు తెల్పుతున్నాయి. అయితే అలా భర్తతో వెళ్లిన ఆమె.. అక్కడ లాహోర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ అనే ముస్లిం వ్యక్తిని భర్త సమక్షంలోనే వివాహమాడింది. దీంతో ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. అంతేకాదు.. సదరు ముస్లిం వ్యక్తిని వివాహమాడేందుకు ఆమెను ఇస్లాంలోకి మతం మార్చాడా ముస్లిం వ్యక్తి. ఇక ఆ సిక్కు భర్తకు నిఖాకు ముందే పాక్‌లోని కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే పాక్‌కు చెందిన ముస్లిం వ్యక్తితో ఆ మహిళ సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంది. అయితే పాక్‌కు చెందిన వ్యక్తిని వివాహమాడినప్పటికీ.. సదరు మహిళను పాక్‌ అధికారులు భారత్‌కు తిరిగి పంపించేశారు. విజిటింగ్‌ వీసా గడువు ముగియడంతో ఆమెను సిక్కు భర్తతో భారత్‌కు పంపించేశారు. దీంతో సదరు సిక్కు మహిళ.. సిక్కు భర్తతో కలిసి వాఘా-అట్టారీ సరిహద్దు వద్దకు చేరుకుని భారత్‌లో అడుగుపెట్టారు.

సిక్కుల ఆందోళన దేనికంటే..

పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదిక ప్రకారం.. భారత్‌లోని కోల్‌కతాకు చెందిన సిక్కు మహిళ పాక్‌కి వచ్చిందని.. అయితే ఆమె ఇస్లాంను స్వీకరించి ముస్లిం వ్యక్తిని కూడా వివాహమాడినట్లు మాకు రిపోర్టులు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆమె వీసా గడువు ముగియడంతో లాహోర్‌లో ఉండేందుకు వీలుండదని.. అందుకే తిరిగి పంపించేశామని.. తన సిక్కు భర్తతో తిరిగి భారత్‌కు పంపించేశారు. అయితే ఆమె మళ్లీ పాక్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే సిక్కు సంస్థ అధ్యక్షుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు పరంజిత్‌ సింగ్‌ సర్నా.. ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారు. ఒక బెంగాలీ సిక్కు యాత్రికుడు.. పాక్‌లో ఉన్న ముస్లిం వ్యక్తిని మతం మార్చుకుని ఇలా వివాహం చేసుకోవడం.. అది కూడా పవిత్ర గురు్ద్వారా, దిదార్‌ దర్శనం పేరుతో వెళ్లడం సరైంది కాదన్నారు. దీనిని జాథా సభ్యులు గమనించాలన్నారు. ఇలాంటి ఘటనలతో పాకిస్తాన్‌కు వెళ్లే సిక్కు యాత్రికులను నిషేధించే అవకాశం ఉందని.. ఇలాంటి ఘటనలు అలాంటి పనులకు దారితీయోచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సిక్కు సమాజానికి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

NOTE.. పై కథనం.. OpIndia జాతీయ న్యూస్ పోర్టల్ ఆధారంగా రాయడం జరిగింది.


Spread the love
error: Content is protected !!