రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని మదర్సాలు, మసీదులు, దేవాలయాలు,గురుకులాలతో పాటు.. వేదిక్ పాఠశాలు,శిశుమందిరాల్లో తనిఖీ చేయాలన్నారు. అంతేకాదు ఆచార్యకులను కూడా తనిఖీ చెయ్యాలని డిమాండ్ చేశారు.
దేశంలోని ఏ గురుకులాల్లో కానీ.. శిశుమందిరాల్లో కానీ, దేవాలయాల్లో కానీ ఆయుధాలు, డ్రగ్స్ లభించవని నేను హామీ ఇస్తున్నానన్నారు. అయితే మసీదులు, మదరసాల్లో కూడా ఎలాంటి అక్రమాలు జరగడం లేదని వాటికి సంబంధించిన వారు హామీ ఇవ్వాలన్నారు. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.