పాక్.. పేరువింటే చాలు.. ఉగ్రవాదులకు స్వర్గధామమని జగమెరిగిన సత్యం. అంతేకాదు.. అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం హద్దులు మీరుతోంది. పాక్‌లో ఉన్న మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరపుతూ.. వారిని భయబ్రాంతులకు గురిచెయ్యడం నిత్యం పరిపాటిగా మారుతోంది. అంతేకాదు.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు,సిక్కులు, క్రైస్తవులు లక్ష్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు ఓ వైపు అయితే.. మరోవైపు ప్రభత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు. ప్రతి ఏటా మైనార్టీలకు చెందిన యుక్త వయస్సులో ఉన్న యువతులను అపహరించుకుపోవడం.. ఆపై బలాత్కారం జరపడం.. మత మార్చి వివాహం చేసుకోవడం.. తరచూ జరుగుతున్నాయి. ప్రతి ఏటా దాదాపు వెయ్యి మందికి పైగా హిందూ యువతులను, స్త్రీలను బలవంతంగా కిడ్నాప్ చేసి.. ఆపై మతం మార్చి వివాహం చేసుకుంటున్నారు. బెదిరింపులకు గురిచేస్తుండటంతో.. వారు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు.
ఇదిలావుంటే.. మరోవైపు అక్కడు ఉన్న హిందూ దేవాలయాలను కూడా కొల్లగొట్టడం.. అక్కడ ఉన్న హిందూ కుటుంబాలను బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చడం జరుగుతోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన పాక్‌లో ఉన్న మైనార్టీల జీవన పరిస్థితులను అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉన్న సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో మైనార్టీలపై అక్కడి ఇస్లామిక్ అతివాదుల దాడులు పెరుగుతున్నాయి. వీరికి ప్రభుత్వ అధికారులు కూడా మద్దతు పలుకుతున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఉమర్‌కొట్ జిల్లా ప్రాంతంలో ఇటీవల భారీగా వరదలు వచ్చాయి. దీంతో అనేకమంది ప్రాణాలుకోల్పోవడమే కాకుండా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. జిల్లాలోని చోర్ ప్రాంతంలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నట్లు పాకిస్థాన్ రచయిత, జర్నలిస్టు రహత్ ఆస్టిన్ తన ట్విట్టర్‌లో రెండు వీడియోలను పోస్ట్ చేశారు. ఈ వీడియోల ఆధారంగా పాక్‌లో ఉన్నహిందువులపై జరుగుతున్న దాడులు, బలవంతపు మత మార్పిడుల గురించి బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది.
లాక్‌డౌన్ మైనార్టీలైన హిందువులకు రేషన్ సరుకులు అందనీయకుండా..
జర్నలిస్టు రహత్ ఆస్టిన్ తన ట్విట్టర్‌లో గత వారం పోస్ట్ చేసిన వీడియోల్లో.. ఉమర్‌కోట్ జిల్లాలోని చోర్ ప్రాంతంలో జరిగిన సంఘటనలను ఉన్నాయి. వీడియోలో అనేక ఇళ్లను జేసీబీల సహాయంతో నేలమట్టం చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. పాక్‌లో ఇటీవల వచ్చిన వరదలకు ముస్లిమేతరులు తీవ్రంగా నష్టపోయారని సమాచారం. ఇదిలావుంటే కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ కారణంగా పనులు లేకుండా ఆర్ధికంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. అంతేకాదు.. వీరికి ప్రభుత్వం రేషన్ సరుకులను కూడా అందజేయలేదని.. కొన్ని స్వచ్చంద సంస్థలు అందజేసేందుకు ప్రయత్నిస్తే.. వాటిని ప్రభుత్వం మైనార్టీలకు అందకుండా చేసిందని సమాచారం. ఈ క్రమంలో ఇస్లాంలోకి మారితేనే రేషన్ సరుకులతో పాటు.. షాపుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో అనేక మంది మతం మారారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రహత్ ఆస్టిన్ తన ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాదు.. గతంలో కూడా పలు అంతర్జాతీయ మీడియా ఈ సంఘటనపై పలు కథనాలను ప్రచురించింది.
పంజాబ్ ప్రావిన్స్‌లో హిందూ బస్తీ నేలమట్టం..
ఇక ఈ ఏడాది మే మాసంలో ఇక్కడ జరిగిన సంఘటన అందర్నీ కలచివేస్తోంది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ హిందూ బస్తీని ప్రభుత్వం నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో బుల్డోజర్స్ (జేసీబీ)లతో ఇళ్లను నేలమట్టం చేస్తుంటే.. మహిళలు, చిన్నారులు అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ.. కనికరం లేకుండా వారి ఇళ్లను నేలమట్టం చేశారు.
ఈ సంఘటన ఇమ్రాన్ కేబినెట్‌లో హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్న తరీఖ్ బషీర్ చీమ ఆధ్వర్యంలోనే కొనసాగింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. పాక్‌లో మైనార్టీలపై దాడులను ఆపాలంటూ భారత్ తీవ్రంగా హెచ్చరించింది.