తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  Tweetలో మోదీ ఏమన్నారంటే..?

Spread the love

తెలంగాణ రాష్ట్రం అవతరించి.. ఆరేళ్లు పూర్తి చేసుకుని.. ఏడో సంవత్సరంలోకి నేడు అడుగుపెట్టింది. అయితే ప్రతి ఏటా అవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగేవి. కానీ ఈ సారి కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో.. వేడుకలను  నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినత్సోవ శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి తెలుగులో విషెస్ చెప్పారు.  తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోందని.. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నానంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.


Spread the love
error: Content is protected !!